telugu navyamedia
సినిమా వార్తలు

“పిఎం నరేంద్ర మోడీ” బయోపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు

PM-Narendra-Modi-Biopic

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “పీఎం నరేంద్ర మోదీ” కౌంటింగ్ మరుసటి రోజే విడుదల కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మే 23 వరకూ సినిమాను విడుదల చేయవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. చిత్ర విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా నిర్మాత సందీప్‌ సింగ్‌ మాట్లాడుతూ ఓ బాధ్యత గల పౌరుడిగా చట్టాలను గౌరవించడం తన కర్తవ్యమని, చర్చించిన తరువాత, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత మాత్రమే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ఇక సినిమాపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నానని, ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌, నరేంద్ర మోదీ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts