ప్రముఖ నటుడు శ్రీనివాస రెడ్డి తండ్రి వై.రామిరెడ్డి కన్ను మూశారు. ఆయనకు 82 సంవత్సరాలు. జనవరి 24న రామిరెడ్డి మరణించగా ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలిసింది. ఆయన సినిమాల్లో కూడా నటించడం గమనార్హం. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రంలో రామిరెడ్డి ఉపాధ్యాయుడు పాత్రలో నటించారు. ఇప్పుడు ఆయన మరణించాడన్న విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీనివాసరెడ్డి టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
previous post
next post