సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాతలు రాసే వారికి స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారమవుతున్న ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ వేదికపై బాలకృష్ణ కామెంట్స్ చేశారు.
ఇవాళ ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు లేని .. లొకేషన్ తెలియదు అడ్రెస్ ఉండదు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. ఏంటీ ఇవన్నీ..లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అలాగే కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు .. పేరు చెప్పుకోవడానికి ధైర్యంలేని ఈ వెధవలను క్షమిద్దాం. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్ స్టాపబుల్’ అవుతాం” అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
కాగా..బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ షోకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, పుష్ప టీమ్, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా హాజరయ్యి సందడి చేశారు. అలాగే ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. మహేష్ ఎపిసోడ్ ను త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నారు.
కేటీఆర్ ను అవినీతిపరుడు అనడం నచ్చలేదు: పోసాని