వివాహేతర సంబంధానికి రెండు నిండు ప్రాణాలు బలైయ్యాయి. కట్టుకున్న భర్త సోదరుడితోనే వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న ఓ మహిళ విషయం బయటపడటంతో వదిన మరిది ఇద్దరూ ట్రైన్ కింద పది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో జరిగింది.
ఆమె వయస్సు 35 సంవత్సరాలు.. అతని వయస్సు 27 ఏళ్లు.. ఇద్దరూ సమీప బంధువులు..అమె వరుసకు వదిన, మరిది అవుతారు. వీరిద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకుంటూ.. కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించారు.
వివరాల్లోకెళితే..
ఏలూరు కొత్తపేటకు చెందిన వివాహిత.. తన భర్త పిన్ని కొడుకైన రాజమండ్రికి చెందిన 27 సంవత్సరాల యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకునేవారు. నిన్న రాత్రి రాజమండ్రి నుంచి ఏలూరు వచ్చిన యువకుడు.. వివాహితతో ఫోన్‌లో మాట్లాడి బయటకు రమ్మన్నాడని పోలీసులు విచారణ తేలింది.
నిన్న రాత్రి హేము రాజమండ్రి నుంచి ఏలూరు వచ్చి ఫోన్ చేయడంతో.. ఇంట్లోంచి బయటకు వెళ్లేముందు వివాహిత తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు డైరీలో రాసుకుంది. ఆ లెటర్ లో “నా చావుకి ఎవరు బాధ్యులు కాదు, నా ఈ జీవితం నచ్చక అలా ఉన్నా, చనిపోతున్నా. రాజేష్ నితిన్‌ని బాగా చూసుకో, చదువు ఆపకు. రెండు సంవత్సరాల తరవాత మెరైన్ ఇంజనీర్ చదువుతా అన్నాడు. అవి వాడు లోన్ పెట్టుకొని చదువుకుంటాడు. చూస్తూ ఉండు జాగ్రత్త”. అని రాసింది.
సదరు మహిళ బుధవారం ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని.. మరిది ఆత్మహత్యకు ప్రేరేపించడంతోనే వదిన, మరిది కలిసి ట్రైన్ కింద పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతదేహానికి కూతవేటు దూరంలో హేము మృత దేహం కూడ పడి ఉంది. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.