telugu navyamedia
సినిమా వార్తలు

నమ్రతకు బాడీగార్డ్ గా సంజయ్ దత్

Namratha

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ గ‌తంలో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. “వంశీ” సినిమా షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్‌, న‌మ్ర‌త ప్రేమ‌లో ప‌డి ఆ త‌ర్వాత వివాహం చేసుకున్నారు. మ‌హేష్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మై కుటంబానికే న‌మ్ర‌త అంకిత‌మైపోయారు. తాజాగా మీడియాతో న‌మ‌త్ర త‌న కెరీర్‌కు సంబంధించిన విష‌యాల గురించి మాట్లాడారు. హీరో సంజ‌య్‌ద‌త్ గురించి ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించారు. “మ‌హిళ‌ల ప‌ట్ల సంజ‌య్‌ద‌త్ ప్ర‌వ‌ర్త‌న చాలా మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉంటుంది. ముఖ్యంగా ఔట్‌డోర్ షూటింగ్ స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు సంజ‌య్ బాడీగార్డ్‌గా ఉంటూ వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాడు. నేను న‌టించిన వారంద‌రిలో సంజ‌య్‌ద‌త్ బెస్ట్ కో-స్టార్‌. నేను, మ‌హేష్ ప్రేమ‌లో ఉన్నామ‌నే విష‌యాన్ని మొద‌ట‌గా సంజ‌య్‌కే చెప్పాను. అప్ప‌ట్నుంచి ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టించేవారు” న‌మ‌త్ర గుర్తు చేసుకున్నారు.

Related posts