telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్యామ్ కె నాయుడు అరెస్ట్

Shyam

ప్రముఖ కెమెరామెన్ చోటాకె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి తనను వివాహం చేసుకుంటానంటూ ఆయన మోసం చేశాడని ఆర్టిస్టు సాయిసుధ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పెళ్లి చేసుకొమ్మని అడిగితే దాడి చేశారని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు రెండ్రోజుల క్రితం శ్యామ్ కె. నాయుడిని అదుపులో తీసుకొని ప్రశ్నించారు పోలీసులు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్‌ కె. నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts