telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా..

Accident

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. అతి వేగంగా వెలుతున్న ఓ మైనర్ బాలుడు యాక్టివాపై ఓవర్ స్పీడ్‌తో వెళ్తూ.. ఆటో ముందు కట్ కొట్టాడు. యాక్టివాను తప్పించ బోయేందుకు ప్రయత్నించగా ఆటో అదుపు కాకపోవడంతో బోల్తా పడినట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధిత విద్యార్థులంతా అబిడ్స్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నారు.

Related posts