telugu navyamedia
రాజకీయ

రాజ్యసభలో అడుగుపెట్టడానికి నాకు అర్హత లేదా ? నా 18ఏళ్ల తపస్సు వృథాయేనా?

రాజ్యసభ టిక్కెట్ల ఎంపిక కార్యక్రమం కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారి తీసింది . జూన్ నెల 10న జ‌రుగ‌నున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఆదివారం కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది .

ఇందులో చాలా మంది ప్రముఖ నేతల పేర్లు లేవు. రాజ్యసభకు సీట్లు ఆశించిన పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినీ నటి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌గ్మ తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్, కాంగ్రెస్ అధినేత్రిపై కూడా ప్ర‌శ్నల వ‌ర్షం కురింపించారు.

సోనియా జీ.. కాంగ్రెస్‌ చేరిక సమయంలో రాజ్యసభ సీటును నాకు ఇస్తామని ఆఫర్‌ చేశారు. 2003 నాటికి కాంగ్రెస్‌ అధికారంలో లేదు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు ఇమ్రాన్‌ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్‌ ద్వారా నగ్మా ఆవేద‌న చెందారు..

మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఆమె మ‌రో ట్వీట్‌లో చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థు జాబితా..

1. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం,
2. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా
3. ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌
4. ఉత్తర్‌ప్రదేశ్‌ నేత ప్రమోద్‌ తివారీ
5. జైరాం రమేశ్,
6. వివేక్‌ టంకా
7. రాజీవ్‌ శుక్లా
8.మాజీ ఎంపీ పప్పూ యాదవ్‌ సతీమణి రంజీత్‌ రంజన్‌
9. అజయ్‌ మాకెన్‌
10 ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి

Related posts