telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌ కు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు…

court

రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌ కు నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్ సీపీ జోషీకి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ శాసన సభా పక్షంలోకి ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనానికి గుర్తింపు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత ఈ మేరకు నోటీసులు ఇచ్చింది.. కాగా, రాజస్థాన్‌లో 200 అసెంబ్లీనియోజకవర్గాలు ఉన్నాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు 2019 సెప్టెంబరులో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. కాంగ్రెస్‌ పార్టీలో తాము విలీనమవుతున్నామని అసెంబ్లీ స్పీకర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనమవడాన్ని గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, స్పీకర్ ఆదేశాలను సవాల్‌ చేస్తూ దిలావర్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనమవడంపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను మూడు నెలల్లోగా పరిష్కరించాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇక, ఈ ఆదేశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.. స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.

Related posts