telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై, బెంగళూరు ఆ ఆటగాడి కోసం తీవ్ర ప్రయత్నం…

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 సీజన్ మినీ వేలానికి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరపడుతున్న వేళ.. ఫ్రాంచైజీలన్నీ తమ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై దృష్టిసారించాయి..! ఈ నేపథ్యంలో చాలా మంది స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు… డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు ప్రమోషన్లూ ఇస్తున్నాయి..! నైపుణ్యం ఉన్నా.. అవకాశాలు ఇవ్వలేని ప్లేయర్లను వేలంలోకి పంపించడంతో పాటు అవసరం వస్తారనుకున్న క్రికెటర్ల కోసం మరోసారి కోట్లు వెచ్చించేందుకు రెడీ అవుతున్నాయి..! ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బడ్జెట్, లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కుర్రాళ్ల వేటలో పడ్డాయి..! గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ‘చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి ప్రయత్నించాయని నా దృష్టికి వచ్చింది. ఈ రెండు ఫ్రాంచైజీలు సంప్రదించిన తరువాతే రాజస్థాన్ రాయల్స్ కూడా సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకోవడమే కాకుండా జట్టులో అతని స్థాయిని పెంచాలని భావించింది. అందుకే శాంసన్‌ను తమ సారథిగా ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లను కెప్టెన్లుగా ఉంచే పద్దతికి నేను వ్యతిరేకం. ఇక స్టీవ్ స్మిత్‌ను వదులుకొని రాజస్థాన్ రాయల్స్ మంచి పనిచేసింది. అతనికి రూ.12.5 కోట్లు దండుగ. తాజా వేలంలో అతని కోసం ఇంతకంటే ఎక్కువ వెచ్చిస్తే అంతకంటే పిచ్చి పని మరేది ఉండదు.’అని చోప్రా చెప్పుకొచ్చాడు.

Related posts