telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బాలినేని జనసేన పార్టీలోకి మారుతున్నారా?క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి..

జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..తాను జనసేన పార్టీలో చేరబోతున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలేనని క్లారిటీ ఇచ్చారు.

తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు..రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటా.. లేకుండా రాజకీయాలు మానేస్తానని చెప్పారు.  కార్యకర్తల కోసం పోరాటం చేస్తాన‌ని అన్నారు.

ఇటీవల కాలంలో నన్ను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నార‌ని..ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు

చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్‌తో మాట్లాడతానని బాలినేని తెలిపారు.

గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు

Related posts