telugu navyamedia
క్రైమ్ వార్తలు

క‌న్న బిడ్డ‌లు పిల్లలు దూరంగా ఉండండం భ‌రించ‌లేని తల్లి ఆత్మాహుతి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదంలో చోటుచేసుకుంది. ఎదిగొచ్చిన క‌న్న బిడ్డ‌లు దూరంగా ఉండడాన్ని భ‌రించ‌లేని ఓ తల్లి భరించలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బంగారు నగలన్నింటినీ ధరించింది. ఆస్తి పత్రాలతో సహా.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

వివ‌రాల్లోకి వెళితే..

దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన కోట్ల రామారావు, కుమారి (52) దంపతులు రెండున్నరేళ్ల నుంచి రామిరెడ్డిపేటకు నరసరావుపేట రామిరెడ్డిపేటలో రెండున్నరేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు.

ఈ దంపతులకు సునీత, అనురాధ, ఆంజేయులు సంతానం ఉన్నారు. ముగ్గురికి వివాహాలయ్యాయి.. ఉద్యోగ‌రీత్యా వారు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చిన్న కూతురు సునీత మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనైన కుమారి.. భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని రూ.7 లక్షలు నగదు, ఆస్తుల డాక్యుమెంట్లు కుప్పగా పోసి.. బంగారు ఆభరణాలను ధరించి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో నుంచి పొగలు వస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు..కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

.  

Related posts