telugu navyamedia
సినిమా వార్తలు

చిరు ఇంట్లో విక్రమ్‌ టీంకు స్పెషల్​ పార్టీ..హాజ‌రైన సల్మాన్‌ ఖాన్‌

విల‌క్ష‌న్ న‌టుడు కమల్​హాసన్​ను నటించిన విక్రమ్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజు దర్శకత్వం వహించాడు. 

Chranjeevi party to Kamalhassan, salmankhan:యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఈ వేడుకలో బాలీవుడ్​ భాయ్​ సల్మాన్​ ఖాన్​ కూడా పాల్గొన్నారు. ఆ విశేషాలు..

జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో సైతం విక్రమ్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో కమల్ హాసన్ తో పాటూ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ నటులు ఉన్నారు. అలాగే చివర్లో మెరుపులా మెరిశాడు హీరో సూర్య.’

ఇక సూర్య 'రోలెక్స్'​ పాత్రకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

సినిమా హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ హైదరాబాద్ వచ్చారు. ఆయనతో పాటూ సల్మాన్ ఖాన్
కూడా హాజరయ్యారు.

ఈ చిత్రాన్ని వీక్షించిన చిరు.. మూవీ అద్భుతమైన రెస్పాన్స్​ తెచ్చుకున్న నేపథ్యంలో కమల్​ను సన్మానించారు. సినిమా తనకెంతో నచ్చిందని చిత్రబృందాన్ని అభినందించారు.

ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి క‌మ‌ల్‌ని సన్మానించారు. విక్రమ్‌ మూవీ మంచి విజయం అందుకున్న సందర్భంగా కమల్‌ హాసన్‌తో పాటు డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజును చిరు ఇంటికి ఆహ్వానించి అభినందనలు తెలిపాడు. అనంత‌రం ఇంట్లో వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు..

ఈ చిత్రం విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్​ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చిరు విక్రమ్‌ టీంను సత్కరించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

విక్రమ్ సినిమా అద్భుత విజయవంతమైన సందర్భంగా నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్‌హాసన్‌తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్‌ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా, వాట్‌ ఏ థ్రిల్లింగ్‌ ఫిల్మ్‌. మై ఫ్రెండ్‌.. నువ్వు మరింత శక్తిమంతం కావాలని కోరుకుంటున్నా” అని చిరు రాసుకొచ్చారు.

Related posts