telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు అభినందనలు

తొలిసారి తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఘనత సాధించిన శ్రీ అల్లు అర్జున్ కు
తెలుగు సినిమా రచయితల సంఘం అభినందనలు తెలియజేస్తుంది. ఇది తెలుగు సినిమా రంగానికే గర్వ కారణమని గోపాల కృష్ణ పేర్కొన్నారు .
69వ జాతీయ సినిమా అవార్డుల్లో, ఉత్తమ చిత్రంగా ఉప్పెన , ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఆర్. ఆర్ . ఆర్ , ఉత్తమ పాటకు శ్రీ చంద్రబోస్ , ఉత్తమ నేపధ్య సంగీతానికి శ్రీ కీరవాణి , ఉత్తమ సంగీత దర్శకునిగా శ్రీ దేవిశ్రీ ప్రసాద్ , ఉత్తమ గాయకుడిగా శ్రీ కాల భైరవ ,ఉత్తమ కొరియోగ్రఫీకి శ్రీ ప్రేమ్ రక్షిత్ ,ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గాను శ్రీ శ్రీనివాస్ మోహన్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ కి శ్రీ కింగ్ సోలమన్, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ (తెలుగు) పురుషోత్తమాచార్యులు ఉత్తములుగా ఎన్నిక కావడం మా అందరికీ గర్వ కారణమని అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు

Related posts