telugu navyamedia
సినిమా వార్తలు

ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా పలువురు సినిమా తారలు, ప్రముఖులు మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన స్వీట్ విషెస్ అందిస్తూ మహేష్ బాబుతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేశారు.

Mahesh Babu wishes 'Megastar' Chiranjeevi on his birthday | Deccan Herald

ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.మెగాస్టార్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Image

మెగాస్టార్ తో పాటు హీరో వెంకటేష్ కూడా మహేష్ కు విషెస్ తెలిపారు.. హ్యాపీ బర్త్ డే చిన్నోడా అని వెంకీ రాసుకొచ్చారు.

Image

అలాగే  వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ ఇలా చాలా మంది మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related posts