telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారం: వంగలపూడి అనితకు అపరిచిత వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్‌

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కు  ఓ అపరిచిత వ్యక్తి నుంచి  బెదిరింపులు వచ్చాయి. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్య‌వ‌హారంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో విజయవాడలో నేడు ఏపీ మహిళ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. భేటీ జరుగుతుండగా అనితకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది.

భేటీ జరుగుతుండగా అనితకు వైసీపీ నేత నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అనిత.. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సంభాషణ అందరికీ వినిపించారు. మీడియా ముందే అతనితో మాట్లాడారు. ఫోన్ చేసిన వ్యక్తి.. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై అతిగా స్పందించవద్దని అనితను హెచ్చరించాడు. దర్యాప్తు జరుగుతుండగా ఎందుకు అనవసరమైన చర్చ అని ప్రశ్నించాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే బాధ అనిపిస్తుందని చెప్పాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటే కేవలం మాధవ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించాడు. తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృ‌ష్ణా రెడ్డి చెప్పారని అన్నారు.

అయితే తాను వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెబుతున్నానని అనిత సమాధానం ఇచ్చారు. తప్పు చేస్తున్నారు కాబట్టే బాధ అనిపిస్తుందని అన్నారు. చేసిన తప్పును ఎలా సమర్థిస్తారని అనిత ప్రశ్నించాడు. నాలుగు గోడల మధ్య జరిగిందని సజ్జల అన్న మాటలు వినలేదా? అంటూ ఫోన్ చేసిన వ్యక్తిపై అనిత ఫైర్ అయ్యారు.

Related posts