మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్‌సింగ్ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు మన్మోహన్ ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్‌తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు.
previous post