telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మందుబాబుల పుణ్యం… తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం

2020-21 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఏప్రిల్ 1- 2020 నుండి మార్చి 31-2021 వరకు 27 వేల 288 కోట్ల 72 లక్షలు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2019- 20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 4 వేల 682 కోట్ల 81 లక్షలు ఈసారి ఎక్కువ ఆదాయం వచ్చింది. 2019- 20 లో మద్యం అమ్మకాల విలువ 22 వేల 605 కోట్ల 91 లక్షలు కాగా…
కరోనా, లాక్ డౌన్ తో మద్యం దుకాణాలు మూసి వేసినా… మద్యం అమ్మకాలు తగ్గినా .. మద్యం రేట్లు పెంచడంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. 2019-20 తో పోల్చితే 2020-21 లో 13 లక్షల 33 వేల 377 లిక్కర్ కేసులు, 2 కోట్ల 18 లక్షల 93 వేల బీర్ కేసులు తక్కువ అమ్మకం జరిగింది. అయినప్పటికీ ఆదాయంలో మాత్రం భారీగా పెరిగింది. 2020-21 లో 3 కోట్ల 35 లక్షల 49 వేల 811 లిక్కర్ కేసులు.. 2 కోట్ల 73 లక్షల 32 వేల 828 బీర్ కేసుల అమ్మకాలు జరిగాయి.

Related posts