నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూరెండు రోజుల్లో సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు షరీఫ్ పేర్కొన్నారు. శాసనమండలి రద్దుపై తాను స్పందించనని అన్నారు. వైసీపీ నేతలు తనను దూషించడం అనేది సర్వసాధారణమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని షరీఫ్ స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడడంతో వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని యోచిస్తుంది. ఈ మేరకు మండలి రద్దుపై శాసనసభలో తీర్మానం చేయాలని నిర్ణాయించినట్టు తెలుస్తోంది. మండలి వల్ల 600 కోట్ల ప్రజాధనం వృధా అవుతునట్టు ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.