telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మనసు కోరే మరో లోకం

ఊహకు అందని ఆనందాలు చిగిరిస్తున్న ఈ నేలలో
ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో
మనసు కోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో
ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో

అందుకే ఇప్పటికైనా కనులు తెరిచి…
ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుందాం
ఎందుకంటే తుదిశ్వాస వరకూ ప్రకృతి అందాలకు బానిలసమే అందరం…

……
చినుకు కురిసిన క్షణం పుడమి పరిమళం
నీలిగగనాన మిణుగురుల కాంతితరంగం
పచ్చని పొలాన వీచే సమీరం
అలుపులేక ప్రవహించే సెలయేటి ప్రవాహం
శిశిరాన్ని మరిపించే వసంతరాగం
ప్రకృతిలో దాగిన వర్ణాలు అనేకం…

Related posts