2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్.. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం లేపింది. దాంతో బాన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు ఆటకు దూరమవ్వగా.. స్మిత్, వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ మాటాడుతూ.. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి కొన్ని తెలియని విషయాలను పంచుకున్నాడు. సంఘటన జరగకముందే తన సహచర బౌలర్లకు టాంపరింగ్ ఉదంతం గురించి తెలుసని ఆ అంతర్జాతీయ పత్రిక అడిగిన ప్రశ్నకు బాన్‌క్రాఫ్ట్ సమాధానమిచ్చాడు. ‘బాల్ టాంపరింగ్ గురించి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఇతర బౌలర్లకు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే.. నేను చేసిన పని బౌలర్లకు ఎంతో ఉపయోధపడుతుంది. దాని గురించి వాళ్లకంతా ఓ అవగాహన ఉంది. దాని గురించి వివరంగా చెప్పాల్సిన పనిలేదు’ అని బాన్‌క్రాఫ్ట్ అన్నాడు. ‘బాల్ టాంపరింగ్ విషయంలో నేను చాలా లోతుల్లోకి వెళ్లాను. నా విలువలను కూడా మర్చిపోయాను. మా జట్టులో అందరిచేతా ప్రశంసలు పొందాలనే ఉద్దేశం నన్ను బలంగా ఎగదోసింది. జట్టులో నేనొక ముఖ్యమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం నాలో కలిగింది. ఉప్పుకాగితాన్ని బంతికి పూసి జట్టుకు ఉపయోగంగా మారాలని అనుకున్నా. అది జరిగాక కానీ నేను చేసింది తప్పని తెలుసుకోలేకపోయా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో అది కూడా ఒక భాగమని చెప్పొచ్చు. అది నేను నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠం. అది తప్పని తెలిస్తే.. ముందే వేరే నిర్ణయం తీసుకునేవాడిని’ అని కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ అన్నాడు.
previous post
next post