telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సెహ్వాగ్‌ ను కదిలించిన ఆ ఫోటో…

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను కదులించింది ఓ వైరల్ ఫొటో. ఇకపై అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనిపించేలా తనవంతు సహాయాన్ని అందించేలా సెహ్వాగ్‌ను ప్రోత్సహించింది. అతనికి స్ఫూర్తినిచ్చిందా పిక్. ఆక్సిజన్ కొరతను నివారించడానికి ముందుకొచ్చేలా చేసింది. ఆ ఫొటోలో ఓ గృహిణి.. ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌ను ధరించి వంట వండుతోన్న ఫొటో అది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో ఇంట్లోనే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ సపోర్ట్ తీసుకుంటూ.. వంట వండుతూ కనిపించిన ఫొటో అది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పెద్ద ఎత్తున డిబేట్ నడిచింది. శ్రీపాద చిన్మయి వంటి పలువురు సెలెబ్రిటీలు దీనిపై స్పందించారు. తాజాగా ఇదే ఫొటోను వీరేంద్ర సెహ్వాగ్ రీట్వీట్ చేశారు. ఈ ఫొటో చూసిన తరువాత కన్నీళ్లు ఆగలేదని చెప్పాడు. తనను కలచివేసిందని వ్యాఖ్యానించాడు. అమ్మ అమ్మే, ఆమెకు ఎవరూ సాటి రాబోరంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేశాడు. ఢిల్లీలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కొరత ఉందనే విషయాన్ని ఈ ఫొటో మరీ మరీ గుర్తు చేస్తోందని, దీన్ని అధిగమించడానికి తమవంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఆక్సిజన్ కొరతను తీర్చడానికి వీలైనంత సహాయం చేయాలని సూచించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అవసరమైన వారు 91 9024333222 నెంబర్ కు వాట్సప్ మెసేజ్ పంపించాలని సూచించాడు.

Related posts