‘మా’ ఎన్నికలు దగ్గరవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. నటీనటుల సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జోరు అందుకుంది. ‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ర్యాలీగా బయల్దేరిన విష్ణు.. ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుని దాసరి విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత తన ప్యానెల్ సభ్యులతో కలిసి మధ్యాహ్నం 1:30 సమయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందించారు.
ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసాము. 10న ఎన్నికలు జరుగుతాయి.. మేము గెలుస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నాము. … ఈ ఎన్నికలు తెలుగు నటుల ఆత్మగౌరవ పోరాటం అన్నారు. తమ వెనుక జగన్ వున్నారని మీడియానే రాస్తుందని… తనకు 900 మంది సభ్యుల మద్దతు వుందన్నారు.
మా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. తమ మ్యానిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు , పవన్ కళ్యాణ్ గారు తమ ప్యానల్‌కు ఓటేస్తారని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాన్ గారు చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవించనని, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాన్న గారు మాట్లాడతారని చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 10న జరగనున్న ఈ ఎన్నికల్లో మంచువిష్ణుతోపాటు అధ్యక్ష పోరులో బరిలోకి దిగిన ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ మరో సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో నర్సింహారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.’మా’ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి బండ్ల గణేశ్ కూడా సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు.