telugu navyamedia
సినిమా వార్తలు

రణరంగం : “సీతా కళ్యాణం..” లిరికల్ వీడియో సాంగ్

Ranarangam

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  “రణరంగం”. ఈ చిత్రంలో ‘గ్యాంగ్ స్టర్’ గా శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒకటి యువకుడిగా ఉండే పాత్ర, మరో షేడ్ మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. ఈ చిత్రాన్ని దర్శకుడు సుధీరవర్మ రూపొందిస్తున్నారు. నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 2 న  చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి “సీతా కళ్యాణం..” అంటూ సాగే పెళ్ళి సాంగ్ ను విడుదల చేశారు. కే శ్రీహరి, భద్ర రాజిన్, అన్న బేబీ, రాధికా నారాయణ్ ఈ పాటను ఆలాపించారు. బాలాజీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ప్రశాంతి పిళ్ళై ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ఈ లిరికల్ సాంగ్ ను వీక్షించండి.

Related posts