telugu navyamedia
సినిమా వార్తలు

అభిమానికి మంచు మనోజ్ శుభాకాంక్షలు

Manchu-manoj

ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సామజిక అంశాలపై దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మంచు మనోజ్ చివరగా నటించిన చిత్రం “ఒక్కడు మిగిలాడు”. ఈ చిత్రం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తరువాత మనోజ్ ఒక్క చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా తన అభిమానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మంచు మనోజ్ వైజాగ్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు భార్గవ్ బాలు తనపేరుపై ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని మనోజ్ తెలిపాడు. భార్గవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో స్పందించాడు మంచు మనోజ్. “నా పేరున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నాకు ఎల్లప్పుడూ సపోర్టుగా నిలిచే నా తమ్ముడు వైజాగ్ ఫాన్స్ అధ్యక్షుడు భార్గవ్ బాలుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశాడు.

Related posts