telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం

Varun-Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఎఫ్-2”, “గద్దలకొండ గణేష్” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే కొత్త చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు (గురువారం) లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా పోస్టర్‌ చూస్తుంటే… ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ పూర్తిగా మేకోవర్ కానున్నాడు. ఇప్పటికే సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న వరుణ్ తేజ్.. ఈ సినిమా కోసం బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకోనున్నాడు. మొత్తానికి కొత్త దర్శకుడుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related posts