telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగుదేశం మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు ఎన్‌.శివ‌ప్ర‌సాద్ కన్నుమూత

తెలుగుదేశం మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు ఎన్‌.శివ‌ప్ర‌సాద్ శనివారం అనారోగ్యంతో క‌న్నుమూశారు. నటనపై ఉన్న ఆసక్తితో రాజ‌కీయాల్లోకి రాక‌ముందు, వచ్చిన తర్వాత సినీ న‌టుడిగా తనదైన న‌ట‌న‌తో సినిమాల్లో ప‌లు పాత్ర‌ల‌తో మెప్పించారు. ఖైదీ, య‌ముడికి మొగుడు, మాస్టార్ కాపురం, ఆటాడిస్తా, దూసుకెళ్తా, డేంజ‌ర్‌, ద్రోణ‌, తుల‌సి, కిత‌కిత‌లు, పిల్ల జమిందార్, మస్కా, లక్ష్మి, బాలు, జై చిరంజీవ ఇలా ప‌లు చిత్రాల్లో ప్ర‌తి పాత్ర‌కు త‌గ్గ వేష‌ధార‌ణ‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారాయ‌న‌. శివ ప్రసాద్ డాక్టర్ గా కొన్నాళ్ళు సేవలందించి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. నటుడిగా మొదట శివప్రసాద్ ఖైదీతో వెండితెరకు పరిచయం అయ్యారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన డేంజ‌ర్ చిత్రంలో విల‌న్‌గా ఈయ‌న న‌ట‌కు నంది అవార్డ్ కూడా వచ్చింది. ద‌ర్శ‌కుడిగా ప్రేమ త‌ప‌స్సు, టోపీరాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఈయ‌న న‌టుడిగా న‌టించిన చివ‌రి చిత్రం స‌య్యాట‌. రాజేంద్ర ప్రసాద్ ‘టోపీ రాజా స్వీటీ రోజా’ ఆడియెన్స్ ని మెప్పించింది. ఆ సినిమాతోనే రోజా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అవుతూ తనదైన శైలిలో అప్పుడపుడు నిరసనలో భాగంగా తన కళను ప్రదర్శించేవారు. శనివారం మధ్యాహ్నం 2..07 గంటలకు శివప్రసాద్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివప్రసాద్ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.

Related posts