తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిత్రంలోని తొలి పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసభ్యులతో పాటు నిర్మాతలు డి. సురేశ్‌బాబు, జెమినీ కిరణ్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, డీవీవీ దానయ్య, శరత్ మరార్, దర్శకుడు మోహర్ రమేశ్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయిమాధవ్ బుర్రా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరు, చరణ్‌లపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. “చాలా ఏళ్ల ముందు చరణ్ నాతో డాడితో ఓ మొమరబుల్ మూవీ తీయ్యాలి. మనం అందరం ఫ్రౌడ్‌గా ఫీలయ్యే సినిమా కావాలన్నాడు. మొన్న రిలీజ్ అయిన “సైరా” టీజర్ చూడగానే నాకు చరణే గుర్తుకొచ్చాడు. నిజంగా తను నాకు చెప్పిన సినిమానే తీశాడు. గ్రాండియర్‌గా కానీ.. విజువల్స్‌గా కానీ. సురేందర్ రెడ్డి అయితే ఇరగ్గొట్టేశాడు. ఇక అన్నయ్య.. అన్నయ్యను కొట్టేటోడు మళ్లీ పుట్టడు. లవ్ యు అన్నయ్య. ఓ మెగాస్టార్ అభిమానిగా “సైరా” పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యు” అంటూ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు పూరి జగన్నాథ్.
Dashing Director @purijagan heartful words about #SyeRaaNarasimhaReddy pic.twitter.com/5r9ZI2wXxw
— BARaju (@baraju_SuperHit) September 22, 2019
ఆ సినిమాలు చేయను… దర్శకులకు నచ్చకపోవచ్చు : రష్మిక