రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “దర్బార్”. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నయనతార, నివేదా థామస్, దలీప్ తాహిల్, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి “దర్భార్” చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన కూడా ఇటీవల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేస్తారు. అయితే రాజకీయ పార్టీ పెట్టడం అంత సులభం కాదు. దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ముందుగా పార్టీ పేరు రిజిష్టర్ చేయించుకోవడమే కాదు.. పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తలైవా పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను లోలోపలే పూర్తి చేస్తున్నారట. వచ్చే ఏడాది జనవరి తర్వాత రజనీకాంత్ తన పార్టీ పేరుని ప్రకటిస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం. రజనీకాంత్ హీరోగా రూపొందుతోన్న `దర్బార్` చిత్రం విడుదల తర్వాతే అనౌన్స్‌మెంట్ ఉంటుందని అంటున్నారు రజనీకాంత్ వర్గీయులు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post