telugu navyamedia
రాజకీయ

తిన్నది కక్కేస్తానంటున్న మాల్యా.. మోడీ సార్ వినిపించిందా..!!

vijaymalya to india will become a dream

దేశంలో మొదటి ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన మాల్యా మరోసారి తాను తిన్నది కక్కేస్తానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నేను ఇస్తాను మొర్రో అంటున్నా, నన్ను ఆర్థికనేరస్తుడిగా పరిగణించడం సరికాదని ఆయన వాపోతున్నాడు. తాజాగా పార్లమెంట్ లో మోడీ ప్రసంగం విన్న ఆయన క్రిందివిధంగా తన బాధను వెళ్లబుచ్చుకున్నాడు.

ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ విజయ్ మాల్యా గురించి పరోక్షంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనితో మాల్యా ట్విటర్ వేదికగా స్పందిస్తూ… ”పార్లమెంటులో ప్రధానమంత్రి చివరి ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. ఆయన కచ్చితంగా మంచి మాటకారి. రూ.9 వేల కోట్లతో ఓ వ్యక్తి ”పరారయ్యాడు” అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండా ప్రస్తావించారు. మీడియా చెబుతున్న దాన్ని బట్టి అది నా గురించేనని నాకర్థమైంది…” అని పేర్కొన్నారు. నిజంగా ఈ ప్రజాధనాన్ని వసూలు చేయాలని ఉంటే… తాను చెల్లిస్తానన్న సొమ్మును తీసుకోవాలని బ్యాంకులకు ప్రధానమంత్రి ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ”కింగ్ ఫిషర్‌కి అప్పుగా ఇచ్చిన ప్రభుత్వ నిధులను వసూలు చేసిన ఘనతను పొందేందుకైనా ప్రధాని కనీసం ఎందుకు ముందుకు రావడంలేదు? ఆ సొమ్మును తీసుకోమని బ్యాంకులకు ఎందుకు చెప్పడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు.

తాను అప్పులు కట్టేస్తానని కర్నాటక హైకోర్టు ముందు కూడా ఆఫర్ చేశానని విజయ్ మాల్యా గుర్తుచేశారు. ”దీన్ని చిన్న విషయంలా తీసిపారెయ్యెద్దు. ఇది నేను స్పష్టంగా, నిజాయితీగా, నిష్కపటంగా చెబుతున్న మాట. అయితే ఇప్పుడు బంతి వేరే కోర్టులో ఉంది. వెంటనే బాకీ చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయినా కింగ్ ఫిషర్‌కి అప్పుగా ఇచ్చిన డబ్బును బ్యాంకులు ఎందుకు స్వీకరించడం లేదు..?” అని ఆయన ప్రశ్నించారు.

Related posts