సూపర్‌స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మహేశ్ నటిస్తోన్న 26వ చిత్రమిది. ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సాధారణంగా సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద హీరోల కటౌట్లు పెడుతుంటారు. కానీ, సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కోసం ఇప్పుడే కటౌట్ పెట్టేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద 81 అడుగుల భారీ మహేష్ బాబు కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుదర్శన్ థియేటర్‌లో ఏర్పాటుచేసిన 81 అడుగుల భారీ కటౌట్ టీజర్ సెలబ్రేషన్స్‌లో భాగమట. సినిమా విడుదల వరకు ఈ కటౌట్‌ను అలానే ఉంచుతారని సమాచారం. సినిమా విడుదల రోజు ఇదే కటౌట్‌ను ముస్తాబు చేస్తారట. అసలు ఈ కటౌట్‌తోనే ‘సరిలేరు నీకెవ్వరు’ సెలబ్రేషన్స్ షురూ చేశారట.
The Massive Celebrations for #SarileruNeekevvaruTeaser was JUST THE BIGGINING. now its time for on-“ground breaking”celebrations and it begins in our Nizam Fort 🚩
Giant 81 Ft cutout erected in Sudharshan 35mm Theatre 🔥#SarilerNeekevvaru will be a treat to SUPER FANS 😎 pic.twitter.com/QdvFvEn7JV
— Anil Sunkara (@AnilSunkara1) 25 November 2019