telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

తమిళనాడు : .. మాజీ సైనికుడు.. నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం.. హత్య..

SIT Investigation YS viveka Murder

మాజీ సైనికుడు నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టి, ఆమెను చంపి మూటగట్టి ఇంట్లో పడేశాడు. తమిళనాడులోని చెన్నై తిరుముల్లైవాయల్‌‌లో జరిగిందీ దారుణం. స్థానికంగా నివాసముండే ఓ మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను ఇంట్లోనే ఉంచి కుమారుడిని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లింది. తిరిగి వచ్చిన ఆమెకు కుమార్తె కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికింది. చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.

మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతకటంతో, బాత్రూంలోనే ఒక గోనె సంచి కనిపించడంతో విప్పి చూసిన ఆమె షాక్‌కు గురైంది. అందులో తన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఆమె బంధువు, మాజీ సైనికోద్యోగి అయిన వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Related posts