telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ వేల కోట్ల అవినీతి చేశాయి…

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు హైదరాబాద్‌లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్‌లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే డివిజన్ల వారిగా ఇంఛార్జ్‌లు కూడా ప్రకటించి.. పార్టీ శ్రేణులను కదిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బీజేపీ కేంద్రమంత్రులనే దింపుతోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెరాస, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయని…. తెరాస ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదన్నారు. హైదరాబాద్ వరదల్లో 80 మంది మృతి చెందారని.. వారికి ప్రభుత్వం సరిగా సాయం అందించలేదని ఫైర్‌ అయ్యారు. గ్రేటర్‌ ఎన్నికల దృష్ట్యా రోహింగ్యాలను నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల లిస్ట్‌లో చేర్చారని… ఇది ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ చేసిన కుట్ర అని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని ఆరోపణలు చేశారు స్మృతి ఇరానీ. ఇది ఇలా ఉండగా.. కేంద్రమంత్రి వచ్చిన నేపథ్యంలోనే మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేసే యోచనలో ఉంది బీజేపీ.

Related posts