telugu navyamedia
రాజకీయ వార్తలు

వారికీ వ్యాక్సిన్ ఇవ్వలేమని చెప్పిన మహారాష్ట్ర…

Corona Virus Vaccine

మన దేశంలో ప్ర‌స్తుతం 45 ఏళ్లు దాటిన అంద‌రికీ వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుండ‌గా.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌నున్నారు. అయితే, మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేష‌న్ సాధ్యం కాద‌ని ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాలు ప్ర‌క‌టించాయి.. తాజాగా, ఈ జాబితాలో మ‌రో రాష్ట్రం చేరింది.. మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నుంచి తాత్కాలికంగా త‌ప్పుకుంటోంది మ‌హారాష్ట్ర.. టీకాల కొరత కారణంగా మే 1వ తేదీ నుండి వ్యాక్సినేష‌న్ డ్రైవ్ వేగవంతం కాకపోవచ్చునని అంటోంది మ‌హారాష్ట్ర స‌ర్కార్. అంటే.. వ్యాక్సిన్లు చేరుకున్న త‌ర్వాత 18 ఏళ్ల పైవారికి కొంత ఆల‌స్యంగా టీకాలు ప్రారంభించ‌నుంది మ‌హారాష్ట్ర. కాగా, మ‌హారాష్ట్రలో క‌రోనా క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. భార‌త్‌లో న‌మోదు అవుతోన్న పాజిటివ్ కేసుల‌తో పాటు మృతుల సంఖ్య‌లోనూ మ‌హారాష్ట్రలో ఎక్కువ నమోదవుతున్నాయి.

Related posts