telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్లాష్‌ : 15 నుంచి లాక్‌డౌన్‌… ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.12 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 17,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 77 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 20,652 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,62,707 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,84,598 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,09,20,046 కి చేరింది. ఇది ఇలా ఉండగా..  మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నాగపూర్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 15 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు లాక్‌ డైన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో… అత్యవసరాలు, నిత్యావసరాలకు మినహాయింపు ఉంటుందని.. కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల సెంటర్లు లాంటి ముఖ్యమైన సేవలు తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా.. నాగ్‌పూర్‌లో గత 24 గంటల్లో 1800 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత నెలరోజుల నుంచి నాగ్‌పూర్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Related posts