telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా కామెంట్స్

Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పూర్తి రాజ‌కీయాల‌లోకి రానున్నార‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డం లేదు. కొన్నాళ్ళుగా స‌స్పెన్స్ పెడుతూ వ‌స్తున్న త‌లైవా త‌న పార్టీ గ్రౌండ్ వ‌ర్క్ మాత్రం ముమ్మ‌రంగానే జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. సొంత పార్టీ పెడ‌తార‌ని అభిమానులు భావించ‌గా, ఇటీవ‌ల తాను క‌మ‌ల్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని ర‌జ‌నీ పేర్కొన్నారు. దీంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు హీటెక్కాయి. అయితే కొన్నాళ్ళుగా ర‌జ‌నీకాంత్ ‘రజినీ మక్కల్ మంద్రమ్’ అనే పేరుతో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. రానున్న ఎల‌క్ష‌న్స్‌లో ర‌జ‌నీకాంత్‌ 234 స్థానాల్లో త‌న‌ పార్టీ అభ్యర్థులను బ‌రిలో దింప‌నున్నట్టు గ‌తంలో తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీకి సంబంధించి త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌జ‌నీకాంత్ నా మిత్రుడు, మంచి వ్య‌క్తి. తిరుమ‌ల శ్రీవారిలా, శబ‌రిమ‌ల అయ‌ప్ప‌లా అభిమానుల‌ని ఆకర్షించే స‌త్తా ర‌జ‌నీకి ఉంది. కాని ఆయ‌న రాజ‌కీయాల‌లోకి రావ‌డం మాత్రం నేను వ్య‌తిరేఖిస్తున్నాను. మేమిద్ద‌రం మంచి మిత్రుల‌మే అయిన, సిద్దాంత‌ప‌రంగా ఆయ‌న‌కి నేను వ్య‌తిరేకం అని కామెంట్ చేశారు భార‌తీ రాజా.

Related posts