telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ నుంచి ఏ మొనగాడు ఫోన్ చేస్తే వెనక్కి తగ్గావు : జొన్నవిత్తుల

RGV

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. ఇదే క్రమంలో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆర్జీవిపై విమర్శలు చేయడం.. జొన్నవిత్తులపై ఆర్జీవీ ఓ రేంజ్‌లో సెటైర్స్ వేయడం తెలిసిందే. ఆర్జీవీ సెటైర్స్‌పై తాజాగా జొన్నవిత్తుల స్పందించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ హడావుడి చేస్తున్న వర్మ.. మెగా ఫ్యామిలీ సినిమా తీస్తానని ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గాడని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ మొనగాడు ఫోన్ చేస్తే వెనక్కి తగ్గావని నిలదీశారు. నీకు నిజంగా దమ్ముంటే ‘మెగా ఫ్యామిలీ’ తీసేవాడివి కదా అని మండిపడ్డారు. కమ్మం రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ద్వారా వర్మ రాష్ట్రంలో కల్లోలం రేపుతున్నాడని అన్నారు. సినిమా టైటిల్ మార్చాలన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేయడానికే సినిమా తీసినట్టుగా అర్థమవుతోందన్నారు. ఇక ఇంట్లో వాళ్లు నిన్ను ఎలా భరిస్తున్నారో అంటూ తనపై వర్మ చేసిన విమర్శలపై కూడా జొన్నవిత్తుల స్పందించారు. వర్మకు ఏది పడితే అది మాట్లాడటం.. ఏది పడితే అది తీసేయడం అలవాటు అని అన్నారు. ఇంతవరకు ఆయన్ను ఎవరూ ప్రశ్నించలేదని.. తాను ప్రశ్నిస్తున్నందుకు ఫ్రస్టేషన్‌లో తనను టార్గెట్ చేస్తున్నాడని అన్నారు. వర్మ మాత్రం మరోసారి జొన్నవిత్తులపై సెటైర్స్ వేశారు. ‘జొన్న పొత్తు’తో ఇక చాలు ఇక మరో జోకర్ పౌలి బాయ్ పాట వినండి అంటూ దాని లింక్ పోస్ట్ చేశాడు. ‘నేనే కేఏ పాల్’ అంటూ సాగే ఆ పాటలో.. ఏపీ ఎన్నికల సందర్భంగా పాల్ చేసిన హడావుడిపై సెటైరికల్‌గా ఉంది.

Related posts