telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

ప్రముఖుల ఉగాది .. శుభాకాంక్షలు ..

దేశం అంతటా ఉగాది వేడుకలు మిన్నంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్‌మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.

‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు, ప్రపంచంలోని తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండగ మీకు సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని కలిగించాలని ఆశిస్తున్నాను.’

– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

‘తెలుగు ప్రజలందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మార్పునకు ప్రతీక అయిన వికారి నామ సంవత్సర ఉగాది మీ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంటే, కొత్తపయనం ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుంది. అలాంటి ప్రతి ప్రయత్నానికి ఉగాదిలాంటి ఓ రోజును ప్రారంభంగా తీసుకోవాలి. మార్పు దిశగా ముందుకు సాగే క్రమంలో ఉగాదిని ఆహ్వానించాలి, ఆస్వాదించాలి.’

– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పర్వదినం సందర్భంగా మీ ఆకాంక్షలు నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు సంపూర్ణ అరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’

– ప్రధానమంత్రి నరేంద్రమోదీ

భారతీయులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

– రాహుల్‌గాంధీ

తెలుగు రాష్ట్రాల సీఎం లు చంద్రబాబు, కేసీఆర్ తదితరులు కూడా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

Related posts