బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో.. తెలంగాణ నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు లభించింది.. విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేశారని ఫైర్ అయిన కేటీఆర్.. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు.. వీలైతే విశాఖకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటామని.. పోరాటంలో కలిసి ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో.. కేటీఆర్ ప్రకటపై ఆనందం వ్యక్తం చేశారు కార్మికులు… కేటీఆర్ నిర్ణయాన్ని కార్మికులతో పాటు ప్రజలకు కూడా ఆహ్వానించారు. ఇక, ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు కార్మికులు.. సమ్మెబాట పడుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు.. యాజమాన్యానికి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. దశలవారీ ఉద్యమ ప్రణాళిక నిర్ణయించింది ఉక్కు పరిరక్షణ జేఏసీ… ఇక, కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.