telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంస్కృతం మీద రీసెర్చ్ కోసం నాసాలో ఓ ప్రత్యేక విభాగం : పూరి

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో తాజాగా ‘సంస్కృతం’ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “సంస్కృతం చాలా పురాతన భాష. 50 వేల సంవ్సతరాల క్రితం ఆఫ్రికాలో మనిషి మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వేర్వేరు భాషలు సృష్టించాడు. హిబ్రూ, అరబిక్ లాగే మన సంస్కృతం కూడా చాలా పురాతన భాష. సంస్కృతం నుంచే ఎన్నో భాషలు వచ్చాయి. సంస్కృతం చాలా శక్తివంతమైన భాష. సంస్కృతంలో రాసిన మంత్రాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ భాషలో ఒక దైవిక భావన ఉంది. అందుకే ఎవరు మంత్రాలు చదవినా అటెన్షన్‌లోకి వచ్చేస్తాం. మన దేశంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే సంస్కృతం మాట్లాడతారు. సంస్కృతం మన దేశాన్ని ఏకం చేస్తుంది. సంస్కృతం మన అమ్మ. జ్ఞానానికి సముద్రం లాంటిది. మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతంలో ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో సంగీతంలో ఉండే రిథమ్ ఉంటుంది. చదువుతుంటే ఉత్తేజితమైపోయి, రోమాలు నిక్కబొడుచుకునే భాష ఒక్క సంస్కృతం మాత్రమే. సంస్కృతం ఓ దైవ భాష మాత్రమే కాదు. ఎంతో సైన్స్ కూడా సంస్కృతంలో రాశారు. సంస్కృతం మీద రీసెర్చ్ కోసం నాసాలో ఓ ప్రత్యేక విభాగం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం కోర్సు నేర్పుతున్నారు. అపారమైన జ్ఞానం అంతా సంస్కృతంలో ఉంది కాబట్టి చాలా క్రిస్టియన్ దేశాలు తమ పిల్లలకు సంస్కృతం నేర్పుతున్నాయి. మనం మాత్రం సంస్కృతంలో పది అంకెలు కూడా చెప్పలేము” అంటూ పూరీ చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/u_D8m7vrYno @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

Related posts