telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్రప్రభుత్వ వైఖరి ఏంటి?

తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్షత చూపుతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నీటి ప్రాజెక్టు పూర్తిచేసుకోవడంతో జలవనరులు పెరిగాయనీ, ప్రభుత్వం రైతు బంధుతో పంటలకు పెట్టుబడి పథకంతో ఆర్థికంగా ఆదుకోవడంతో సాగు విస్తీర్ణం ఆశాజనకంగా పెరిగిందనీ, ధాన్యం దిగుబడుల్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచామన్నారు.

ధాన్యం సేకరించే విషయంలో కేంద్రప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో ధాన్యం సేకరించే విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరి స్పష్టంచేయాలని పట్టుబట్టారు. దేశం రైతాంగం కోసం జాతీయ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తీసుకురావాల‌ని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Related posts