telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఒప్పంద విషయంలో తిరుగులేదు…

తెలంగాణ ప్రభుత్వం… అంచనాలు… వాస్తవాలకు చాలా తేడాగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పియూష్ గోయల్ రాజ్యసభలో ప్రస్తావించారు.ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన చర్చలు, ఒప్పంద విషయాలను గణాంకాలను వెల్లడిస్తూ సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా అవసరాలకు తగ్గట్టుగా ధాన్యాన్ని ఎక్కువగానే సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి ఎక్కువమోతాదులోనే ధాన్యం సేకరిస్తున్నామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ గణాంకాలతో వెల్లడించారు. 2018-19లో తెలంగాణలో 51లక్షల 9వేల టన్నులు సేకరించామనీ, 2019-20లో 74లక్షల 5వేల టన్నులు, 2020-21లో 94లక్షల 5 వేల టన్నుల ధాన్యం సేకరించిన విషయాన్ని వివరిస్తూ… ప్రతియేటా సేకరిస్తున్న ధాన్యాన్ని పెంచుతున్నామన్నారు. ఒప్పందం కుదుర్చకున్న ప్రకారం ధాన్యం ఇవ్వడంలో తెలంగాణ వెనుకబడిఉందని పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో 50లక్షల టన్నుల ధాన్యం ఇస్తామన్న ఒప్పందంలో 32 లక్షల 66వేల టన్నులే ఇచ్చిందని, మిగిలిన ధాన్యం గురించి ఎలాంటి పురోగతి కన్పించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.

తెలంగాణ నుంచి 24లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు ఒప్పందం జరిగిన విషయాన్ని గోయల్ సభకు తెలిపారు. ఆ తర్వాత అభ్యర్థనతో సంబంధంలేకుండా 44లక్షల టన్నులకు పెంచినవిషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ వచ్చిందనీ.. ఇంకా 17లక్షల టన్నులు ధాన్యం పెండింగ్‌ తెలంగాణ ప్రభుత్వంనుంచి రావాల్సి ఉందన్నారు. పెండింగ్‌ ధాన్యం పంపకుండా భవిష్యత్‌ గురించి టీఆర్ఎస్ ఎంపీలు రాద్దాంతం చేస్తున్నారని పియూష్ గోయల్ అసహనం వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనూ… బాయిల్డ్ రైస్ కొనబోమని స్పష్టంగా పేర్కొన్నామన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు అర్థరహితంగా రాద్ధాంతం చేస్తూ… గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహంవ్యక్తంచేశారు.బాయిల్డ్‌ రైస్‌ పంపబోమని అక్టోబర్‌ 4న తెలంగాణ లేఖ రాసిన తర్వాత ధాన్యం విషయాన్ని రాజకీయం చేస్తున్న విషయంలో అంతరార్థం అర్థంకావట్లేదన్నారు.

Related posts