telugu navyamedia
రాజకీయ

74 సంవత్సరాలనాటి అరుదైన జ్ఞాపక చిత్రమ్ ..

1947 ఆగస్టు 15 వ తేదీన మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. దేశంలో వున్నా ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నారు . ఢిల్లీ లో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలను మద్రాసు మహానగరంలో ప్రథమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి .

ప్రముఖ తెలుగు నవలాకారుడు ‘ చివరకు మిగిలేది’ పుస్తక రచయిత, బుచ్చిబాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు . ఆరోజు తీసిన అరుదైన ఫోటో ఇది. ఇందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీరంగ ప్రముఖుల వున్నారు అప్పట్లో సినిమా రంగానికి కేంద్రం గా మద్రాసు ఉండేది.

ఈ ఫొటోలో సుందరీబాయి, తులసి, రావు బాలసరస్వతీ దేవి, తులసి సోదరి , పుష్పవల్లి , కృష్ణవేణి , మాలతి, ప్రేమ , టి .ఆర్ .రాజకుమారి . శాంతకుమారి, భానుమతి, టంగుటూరి సూర్యకుమారి, జయమ్మ , ఎమ్ .ఎస్ .సుబ్రమణియన్ ,చిత్తూరు నాగయ్య , హెచ్. యల్. నారాయణ రావు, గోవిందరాజుల సుబ్బారావు, ముదిగొండ లింగమూర్తి ,సి. యస్. ఆర్. సిహెచ్. నారాయణరావు, దండపాణి దేశికర్, కె. ఆర్. రామస్వామి, రంజన్, టి. ఆర్. రామచంద్రన్, హొన్నప్ప భాగవతార్, కె. సుబ్రహ్మణ్యం .

ఆరోజుల్లో నటీనటులు అన్ని బాషా చిత్రాల్లో నటించేవారు . సామరస్యంగా మెలుగుతూ అన్ని వేడుకలకు హాజరయ్యేవారు .దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఈ సినిమా ప్రముఖులను ఒకే చోట కలిపిన బుచ్చి బాబు అప్పటిలో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసేవారు .

Related posts