telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ… న్యూ లుక్ వైరల్

యంగ్ సెన్సేష‌న‌ల్ హీరో ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకుడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి లుక్‌లో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లో “ఫైట‌ర్” మూవీ అనే సినిమా కూడా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఫైట‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ బాక్సర్‌గా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఇందులో భాగస్వామిగా చేరబోతున్నట్లు తెలిసింది. ఇక విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” చిత్రానికి బాక్సాపీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటనపరంగా విజయ్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకుగాను విజయ్‌దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్-ఏడో వార్షికోత్సవంలో విజయ్ అవార్డు అందుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌కు కేజీఎఫ్ ఫేం యశ్ ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేశాడు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో విజయ్, రష్మిక ర్యాంప్‌వాక్ చేసి సందడి చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Vijay-Devarakonda

Related posts