telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ రొమాన్స్ చేయనున్న కత్రినా కైఫ్‌ !

katrina

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్‌లలో పా ల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది స్పెషల్ గా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.  ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ‘మల్లీశ్వరి’గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయింది కత్రినా కైఫ్‌. అమ్మడు ఇప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించబోతోందట. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సిద్ధార్థ్ అనంద్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించబోయే యాక్షన్ సినిమాలో కత్రినానే హీరోయిన్ అని అంటున్నారు. గతంలో హృతిక్ తో ‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ సినిమాలను తెరకెక్కించిన సిద్ధార్థ్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ సినిమా ‘బ్యాంగ్ బ్యాంగ్’లో నటించిన కత్రినాకు అతనితో మంచి రాపో ఉంది. అందుకే భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ప్రభాస్ సినిమాలో నటించటానికి ఓకె చెప్పిందట. 

Related posts