telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బెంగాల్ లో అధికారం దిశగా తృణమూల్ కాంగ్రెస్

పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకువస్తోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కు క్లియర్ మెజారిటీ వచ్చింది. మేజిక్ ఫిగర్ మార్క్ దాటిన
తృణమూల్ కాంగ్రెస్… 176 స్థానాల్లో ముందంజలో ఉంది. 108 స్థానాల్లో ముందంజలో బిజెపి ఉండగా, ఐదు స్థానాల్లో ముందంజలో ఇతరులు ఉన్నారు. వెనుకంజలో కాంగ్రెస్, వామపక్ష కూటమి కొనసాగుతోంది. అయితే.. నందిగ్రాం ఫలితం పైనే అందరి దృష్టి ఉంది. నందిగ్రాం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా… బిజేపి అభ్యర్థిగా ఒకప్పటి మమతా బెనర్జీ అత్యంత సన్నిహిత సహచరుడు సువేందు అధికారి రంగంలో ఉన్నారు. మమతా బెనర్జీ కంటే 4,500 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మొదట్లో మమతా ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు సువేందు ఆధిక్యంలోకి రావడం విశేషం. అయితే తుది ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.

Related posts