telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4″లో ఈసారి ఇవి ఉండవట..!!?

Bigg-Boss-4

బిగ్ బాస్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆశగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు ఇటీవలే స్టార్ మా అప్‌డేట్ ఇచ్చింది. బిగ్ బాస్ 4 ప్రోమోను విడుదల చేసింది. కేవలం టైటిల్ లోగోను మాత్రమే ఈ ప్రోమోలో చూపించారు. నాలుగో సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కిందటేడాది మాదిరిగానే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ సెట్ సిద్ధమవుతోందని తెలిసింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం. గత సంవత్సరం 100 రోజులకు పైగా ఈ షో నడిచింది. కానీ ఈసారి మాత్రం రోజులు తగ్గించనున్నారట. అంతేకాదు, షోలో కొత్తగా చాలా మార్పులు చేశారని టాక్. కొత్తగా చేసిన మార్పుల్లో ముఖ్యమైనది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు ఉండరని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. గడిచిన మూడు సీజన్లలో జనాల్లో ఈ షో పట్ల మరింత ఆసక్తిని పెంచడానికి ఈ ఎంట్రీలు ఉండేవి. హౌజ్‌లో టాస్క్‌లన్నీ ఫిజికల్‌గా తలపడేలా కాకుండా మెంటల్‌గా తలపడేలా ఉంటాయట. గత సీజన్ల మాదిరిగా కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడటాలు, హగ్గులు లాంటివి కూడా ఈ సీజన్‌లో ఉండవని అంటున్నారు. ఇక హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల సంఖ్య కూడా గతంతో పోల్చుకుంటే తక్కువే ఉంటుందని అంటున్నారు.

Related posts