ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి ద్వజమెత్తారు. పోలింగ్ సందర్భంగా జరిగిన సంఘటనల పై ఆయన ఘాటుగా స్పందించారు. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలు సరిగా పనిచేయని పరిస్థితులపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంలో ఉన్న అంతర్యామేమిటని ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం మీరు కలిసి చేశారు కాబట్టి ఒక్క మాట కూడా అనడంలేదని జగన్ పై మండిపడ్డారు. పోలింగ్ రోజున ఈసీ ఏంచేసినా మీకు ఆమోదయోగ్యం అయిందన్నారు. సాయంత్రం పోలింగ్ కూడా పూర్తికాకముందే లోటస్ పాండ్ లో మీడియా సమావేశం ఎలా పెట్టారని ప్రశ్నించారు.
జగన్ సాయంత్రం ఆరు, ఏడింటికల్లా హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ్నించే కుట్రలు, కుతంత్రాలు చేస్తాడని దుయ్యబట్టారు. ఈ పనులు చేయడానికి మూడు రోజులు సెలవు తీసుకున్నాడు. డబ్బులు వసూలు చేయడం, ఈవీఎంల్లో మార్పులు చేయడం, రౌడీయిజం చేయడం వీటికోసమే సెలవు తీసుకున్నాడని చెప్పారు. . ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ నాయకుడు 3 రోజులు హాలీడే తీసుకోవడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. అతను హాలీడే అన్నప్పుడల్లా మాకు డౌట్! ఏదో చేయబోతున్నాడని అనుకునేవాళ్లమని పేర్కొన్నారు.
సుమలత ఫేస్బుక్ బ్లాక్.. కుమారస్వామిపై ఫైర్