telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇక్కడ టూరిస్టులకు ఆకర్షించడానికి “ఒకరోజు పెళ్ళి”…!

Marry

పర్యాటకులను ఆకర్షించడానికి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి నెదర్లాండ్స్ పర్యాటకశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెదర్లాండ్స్ జనాభా కంటే పర్యాటకుల సంఖ్య ఎక్కువవడంతో పర్యాటకులు, అక్కడి స్థానికుల మధ్య కూడా సత్సంబంధాలు ఏర్పడేలా ‘మ్యారీ యాన్ ఆమ్‌స్టర్‌డ్యామర్ ఫర్ ఏ డే’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అంటే.. నెదర్లాండ్స్ వెళ్లే పర్యాటకులు అక్కడి స్థానికులను ఒకరోజు పెళ్లి చేసుకోవచ్చన్నమాట. ఈ పెళ్లిని ఒక చర్చిలో అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తారు. అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుని రోజంతా వారితో హనీమూన్ చేయచ్చు. హనీమూన్ అంటే అన్నీ ఉంటాయి అనుకుంటే పొరపాటే. ఒక రోజంతా అందమైన ప్రదేశాలను పెళ్లి చేసుకున్న వారితో కలిసి చూడవచ్చు. ఈ హనీమూన్‌లో పెళ్లి చేసుకున్నవారితో అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఒక హగ్ మాత్రం ఇవ్వచ్చు అంతే. తిరిగి సాయంత్రం పర్యటన ముగిసిన వెంటనే ఎవరి దారి వారు తీసుకుని వెళ్లిపోవడమే. ఒకవేళ ఆ ఒక్కరోజులోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే వారికి నచ్చినట్టు ఉండచ్చు.. నచ్చితే పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కూడా వినియోగించనున్నారు. రానున్న పదేళ్లలో నెదర్లాండ్స్ వెళ్లే పర్యాటకుల సంఖ్య 50 శాతం పెరగనున్నట్టు అక్కడి ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఒకరోజు పెళ్లి మంచి అనుభూతిని కల్పించిందని చాలా మంది పర్యాటకులు చెబుతున్నారు

Related posts