telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు, లక్ష్మినారాయణ తోడు దొంగలు: అంబటి

YCP Ambati Slams to JD Laxminaryana

విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరడం దాదాపుగా ఖరారైందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లక్ష్మినారాయణపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జేడీ లక్ష్మినారాయణలు తోడు దొంగల్లా వ్యవహరించారని ఆరోపించారు. జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ మీడియా అద్బుతమైన ప్రచారం కల్పించిందని అంబటి ఆరోపించారు. చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ రహస్యంగా మాట్లాడుకుంటున్నారని, కాల్ డేటా బయటకు తీయాల్సిందిగా ఆరోజు వైసీపీ డిమాండ్ చేసిందని రాంబాబు గుర్తుచేశారు.

జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన జనసేన, లోక్‌సత్తాలలో చేరుతున్నట్లు యెల్లో మీడియా ప్రచారం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు చంకనెక్కి తెలుగుదేశం పార్టీలో లక్ష్మీనారాయణ చేరబోతున్నారంటే ఏ నాటి బంధమోనని అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీకి దగ్గరవ్వడం ద్వారా లక్ష్మీనారాయణ నిజస్వరూపం బయటపడిందన్నారు. జగన్ జైలులో ఉన్నప్పటికి విజయమ్మ, షర్మిలమ్మ పార్టీని ముందుకు నడిపించారని రాంబాబు గుర్తుచేశారు.వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు పత్రికలు జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా వార్తలను రాస్తున్నాయని మండిపడ్డారు.

Related posts